తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

మోంతా తుఫాన్ కారణంగా జిల్లాలో కురిసిన వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఇందల్వాయి మండలం గన్నరం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతుల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ స్థాయిలో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. "రైతు చెమట చుక్క వృథా కాకుండా ప్రతి తడిసిన గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. రెండు రోజుల్లో రైస్ మిల్లులకు తరలించి, మూడో రోజుకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం," అని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్