కమ్మర్ పల్లి మండలం హాస కొత్తూరు ఉన్నత పాఠశాలకు చెందిన ప్రతిభ, ఆశ్రీత అనే ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో వీరిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. సంగారెడ్డిలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. విద్యార్థినులతో పాటు శిక్షణ ఇచ్చిన పీ.డీ. మాధురిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.