నవీపేట్ శివారులో మహిళ దారుణ హత్య.. మొండెం లభ్యం

నవీపేట్ ఫకీరాబాద్ శివారులో మహిళ హత్యకు సంబంధించి నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడారు. మహిళను ఎక్కడో హత్య చేసి ఫకీరాబాద్ శివారులో పడేసినట్లు తెలిపారు. మహిళ తల కనిపించలేదని, మొండెం మాత్రమే లభించిందని, ఆమె వయసు దాదాపు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. హత్యకు సంబంధించిన వివరాలను సేకరించడానికి ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్