*ప్రజావాణికి 128 ఫిర్యాదులు*

నిజామాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో 128 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవించుకున్నారు.

సంబంధిత పోస్ట్