యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరిగిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన క్రీడాకారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ పోటీల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడలు నిర్వహించారు. మంగళవారం ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ ముగింపు కార్యక్రమం జరిగింది.