నిజాంసాగర్లో మళ్లీ పెరిగిన వరద.. 21వరద గేట్ల ఎత్తివేత

ఈ ఖరీఫ్ సీజన్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టులో వరద తగ్గే సూచనలు కనిపించడం లేదు, మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుండి 1,30,144 క్యూసెక్కుల భారీ వరద వస్తుండటంతో, ఆదివారం సాయంత్రం 21 వరద గేట్లను ఎత్తి 1,51,144 క్యూసెక్కుల నీటిని మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టులోని వివిధ గేట్ల నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంజీరా, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్