వేల్పూర్: జాతీయ రహదారి పక్కన వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుడు, గాయపడిన వ్యక్తి మోర్తాడు మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.