నిజామాబాద్ జిల్లాలో 31 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, మండల పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ జాబితా వెలువరించారు. 31 జడ్పీటీసీ స్థానాలకు బీసీలకు 12, జనరల్ 10, ఎస్సీ 5, ఎస్టీలకు 3 కేటాయించారు. మండల పరిషత్ స్థానాలకు కూడా ఇదే కేటాయింపులు జరిగాయి. జడ్పిటిసి, ఎంపిపి స్థానాలలో మహిళలకు సగం, అంటే 14 స్థానాలు కేటాయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బిసీ, జనరల్ స్థానాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత లభించింది.