స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా, జిల్లాలోని జెడ్. పి. టి. సి, ఎం పి. పి స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీ. ఈ. ఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ. ఈ. ఓ సాయన్నలతో కలిసి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం సాయంత్రం ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలోని 31 జెడ్. పి. టి. సి, ఎం పి. పి స్థానాలకు ఎస్. సి, ఎస్. టి, బి. సి, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్. సి, ఎస్. టి రిజర్వేషన్లు, బీ. సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బి. సి రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.