రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్ లో నమోదు చేయాలని సూచించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యా శాఖల పురోగతిపై శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాఠశాల విద్యా సంచాలకులు నికోలస్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా పాల్గొన్నారు.