నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష విధించారు. గౌతమ్ నగర్ కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటగల్లీకి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల చొప్పున, బోధన్ కు చెందిన సురేందర్కు 3 రోజుల జైలు శిక్ష పడింది. ట్రాఫిక్ సీఐ పబ్బ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, మరో 32 మందికి 56,500 రూపాయల జరిమానా విధించారు.