మల్టీజోన్-1 పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ బదిలీలు జరిగాయి. సీపీ సాయిచైతన్య బుధవారం ఈ మేరకు ఆర్డర్లు జారీ చేశారు. సీసీఆర్బీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్‌ను నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వోగా, వీఆర్‌లో ఉన్న సీహెచ్. శ్రీనివాస్‌ను నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా, వెయిటింగ్లో ఉన్న అశోక్‌కు ఎన్ఐబీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. వీరు త్వరలోనే తమ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.