గాంధారి మండల కేంద్రానికి చెందిన ఒడుసుల చిరంజీవి (30) మద్యానికి బానిసై, కుటుంబ సభ్యులు మద్యం మానుకోని, పని చేయమని కోరినందుకు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు గాంధారి పోలీసులు తెలిపారు. ఆదివారం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చిరంజీవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.