గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారిందని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ.. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తమ ఎమ్మెల్యేలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? అని ప్రశ్నించారు. 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని అన్నారు.