భారత్‌ వాంటెడ్‌ జకీర్‌ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి నో ఎంట్రీ

పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు వచ్చిన వార్తలకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తెరదించింది. మంగళవారం హోం మంత్రిత్వశాఖ నేతృత్వంలో జరిగిన లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ సమావేశంలో, ఆయన దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరించాలని నిర్ణయించారు. జకీర్ నాయక్‌ కార్యక్రమాలకు భారీ జనసమూహం వచ్చే అవకాశం ఉందని, వారిని నియంత్రించడానికి పెద్దమొత్తంలో బలగాలను మోహరించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్