బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడొద్దు: మంత్రి పొన్నం

TG: తాము ఎవరి హక్కులకు భంగం కలిగించట్లేదని.. అందుచేత బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరైనా అడ్డుపడితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో రిజర్వేషన్లను అడ్డుకుంటామంటే బీసీలు ఊరుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్