ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 ను వెనెజువెలా హక్కుల కార్యకర్త మరియా కొరీనా మచాడో అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బహుమతి కోసం ప్రయత్నించారు. మచాడో తన సోషల్ మీడియాలో ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతో పాటు, తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వెనెజువెలా ప్రజల కష్టాలను గుర్తించడం తమ పోరాటానికి ఊతమిస్తుందని, స్వేచ్ఛ పొందేందుకు దగ్గరలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు.