బిగ్‌బాస్ సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ, నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్టి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు.