ప్రపంచ బయో ప్రొడక్ట్ దినోత్సవాన్ని ఏటా జులై 7న నిర్వహిస్తారు. 2021లో వరల్డ్ బయో ఎకానమీ ఫోరం ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ స్థిరత్వం, వాతావరణ చర్య, పర్యావరణ అనుకూల ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో బయో ఆధారిత ఉత్పత్తుల సామర్థ్యాన్ని గురించి అవగాహనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.