AP: అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం తాగుతూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న (39) బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కొని తాగాడు. విపరీతమైన మైకం తలకెక్కి తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లి స్పృహ కోల్పోయాడు. కొందరు వెళ్లి ఆయనను చూడగా పెద్దన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చారు.