AP: ఉల్లి రైతుకు ఊరట కలిగింది. కర్నూలులో రూ.2లకే కిలో ఉల్లి విక్రయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 45 కేజీల ఉల్లి సంచిని రూ.100కు అధికారులు ఇస్తున్నారు. రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ఉల్లి రూ.1200కు కొనుగోలు చేసింది. హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.