ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించిన కొత్త నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, వాటాదారులతో పలుమార్లు చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. నియమాలు అమలు చేసే ముందు మరోసారి పరిశ్రమతో చర్చిస్తామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చింది. ఇది ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్‌ను నియంత్రించనుంది.