భారత్‌లో త్వరలో ఓపెన్‌ ఏఐ డేటా సెంటర్

ఓపెన్‌ ఏఐ భారత్‌లో తన కంపెనీని విస్తరించేందుకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్‌ మద్దతుతో ఉన్న ఈ కంపెనీ భారత్‌లో లీగల్‌ ఎంటిటీగా రిజిస్టర్‌ అవుతూ, స్థానిక బృందాన్ని ఏర్పాటు చేసింది. కనీసం 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో నిర్మించేందుకు భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది. న్యూఢిల్లీలో ఈ ఏడాదిలోపు తొలి ఆఫీస్‌ ప్రారంభం కానుంది. వచ్చే నెలలో భారత్‌ పర్యటనలో సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌ ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్