పేరు మార్చుకున్న OYO.. కొత్త పేరు ఏంటంటే?

ఓయో కంపెనీ పేరు మారింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. అయితే ఒక బ్రాండ్‌గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఐపీఓ ముంగిట ఇకపై ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని బోర్డు ఛైర్మన్ రితేశ్ అగర్వాల్ ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపై తీసుకురానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్