యూఏఈలో ఆసియా కప్ 2025 ప్రెస్ మీట్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ జర్నలిస్ట్ అఫ్గనిస్థాన్‌ను ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టుగా ప్రశంసిస్తూ ప్రశ్నించగా, పక్కనే కూర్చున్న సల్మాన్ కాస్త షాక్ గురై, ఇబ్బందిపడ్డాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. పాకిస్థాన్‌కు గతంలో ఉన్న గౌరవం తగ్గిందన్న భావనతోనే అతను అలా రియాక్ట్ అయి ఉంటాడని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.