జమ్మూ కాశ్మీర్ కుప్వారాలోని నౌగామ్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మరోసారి కవ్వింపులకు దిగింది. సెప్టెంబర్ 20 సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన ఈ ఘర్షణలో భారత్ సైన్యం సమర్థంగా ఎదురు కాల్పులు చేసి పాకిస్థాన్‌ను నిలిపివేసింది. సుమారు గంట పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటనతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.