డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పాకిస్థాన్ జెండా

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఎక్స్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఆదివారం ఆయన ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు పాకిస్థాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్టు చేశారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సుమారు 30-45 నిమిషాల తర్వాత ఖాతాను తిరిగి నార్మల్ స్టేజ్‌కి వచ్చినట్టు అధికారులు తెలిపారు. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ అస్సాం యూనిట్ ఖాతాలు కూడా హ్యాకింగ్‌కు గురైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్