మెజీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, జబర్దస్త్‌తో కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, హీరోగా తన ఐదవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఇది పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుండటం విశేషం. రామ్ చరణ్ అభిమాని శివ చెర్రీ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. వజ్రవారాహి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను పలు విదేశీ భాషల్లో రాసి, డీకోడ్ చేయమని కోరారు.