యూపీ ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో పార్కింగ్ సమస్యలు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. స్థలం లేకపోవడంతో గురువారం పట్నాకు వెళ్లాల్సిన విమానం 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టింది. బుధవారం కూడా పార్కింగ్ లేక పలు ఫ్లైట్లను రద్దు చేశారు. 2019లో ప్రారంభించిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోంది. అధికారులు రెండు అదనపు బేలు అవసరమని, తొమ్మిది ఎకరాలు విస్తరణకు కావాలని తెలిపారు.