జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ‘రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఆపరేషన్ కగార్ పేరుతో అడ్డు తొలగిస్తున్నారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి దాసోహం అయ్యాయి. దేశంలో బీజేపీతో కలిసి పని చేసిన పార్టీలు అంతమవుతున్నాయి. తెలంగాణలోనూ బీఆర్ఎస్ రెండుగా చీలింది’ అని ఆరోపించారు.