జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పాస్టర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పాస్టర్లు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.