ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 34 ఏళ్ల క్రితం తనతోపాటు కరాటే శిక్షణ పొందిన స్నేహితుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. 34 ఏళ్ల తర్వాత తన కరాటే స్నేహితుడు తిరు రేన్షి రాజాను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను పవన్ పంచుకున్నారు. కోలీవుడ్ నటుడు, కరాటే శిక్షకుడు షిహాన్ హుసైని వద్ద పవన్ మార్షల్ ఆర్ట్స్‌లో 1990ల్లో ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే.