ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్‌కు ఇప్పటికీ ట్రోఫీ దక్కలేదు. మ్యాచ్ అనంతరం పాక్ మంత్రి మొహ్‌సీన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా అందుకోవాల్సి ఉండగా, బీసీసీఐ తిరస్కరించడంతో నఖ్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో లాకర్‌లో ఉంది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ వార్షిక సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినా, నవంబర్‌లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ఏసీసీ నిర్ణయించింది.