చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. చైనా, భారత్ సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది. ఇటీవలే కైలాశ్ మానస సరోవర్ యాత్ర కూడా పునఃప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.