అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ఆశలు ఈసారి నెరవేరలేదు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనాను ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది. ఈ ఎంపికపై వైట్‌హౌస్ స్పందిస్తూ, నోబెల్ కమిటీ రాజకీయ వివక్ష చూపించిందని విమర్శించింది. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ మాట్లాడుతూ, శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.