ఆమె చేసే పోపు అటుకులకు స్థానికంగా ఫుల్ క్రేజ్. 20 ఏళ్లుగా ఆమె తన హోటల్ను చిన్న గుడిసెలో నిర్వహిస్తుంది. భర్త లేకపోయినా సరే ఎంతో కష్టపడి, ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసింది. వారిలో ఒకరు ఆర్మీ కాగా మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్కు చెందిన సుశీలమ్మ. నేటి తరానికి ఆదర్శంగా ఉన్న ఆమె మాట్లాడుతూ.. చేతనైనన్ని రోజులు కష్టపడుతూనే ఉంటానని పేర్కొంది.