పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, మంగళవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్‌లతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరించాలని, డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆమె సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్‌లు ఆరోగ్య కేంద్రాలలో వ్యాధుల నిర్ధారణకు అవసరమైన రక్త నమూనాలను సేకరించి, పెద్దపల్లి టీ హబ్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపించాలని ఆదేశించారు.