పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు మూడు రోజుల పాటు పత్తి తీసుకురావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో పత్తి కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ మిల్లులు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలుదారులు పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు రైతులు మార్కెట్ కు, జిన్నింగ్ మిల్లుల వద్దకు పత్తి తీసుకురావద్దని సూచించారు.