తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదవ తరగతి, ఇంటర్ అడ్మిషన్ల గడువును ఈనెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పొడిగించినట్టు మంథని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సుమలత తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు, గృహిణిలు, వృత్తి పనులు నిర్వహిస్తున్న వారు, చదువు కొనసాగించాలని, ఆసక్తి ఉన్నవారు మంథని బాలికల ఉన్నత పాఠశాలలో సంప్రదించి అడ్మిషన్లు పొందాలని కోరారు.