అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా.?

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై శుక్రవారం ఉదయం మున్సిపల్ అధికారులు కొరఢ ఝళిపించారు. గంగపురి బొక్కల వాగు సమీపంలో నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని జెసిబి యంత్రాలతో కూల్చివేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీస్ పహారా మధ్య, మున్సిపల్ సిబ్బంది ఆక్రమణల కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్