2024-25 ఖరీఫ్ సీజన్ సంబంధించి పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీని ఈనెల 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఖరీఫ్ 2024 సీజన్ లో 99.5% సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేసి, రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా కృషి చేసిన మిల్లర్లు, అధికారులను ఆయన అభినందించారు.