పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని పెద్ద బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పూలతో బతకమ్మలను అలంకరించి, గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో వాటిని పెట్టి, బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో ఉదయం నాలుగు గంటల వరకు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.