రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుందని, ఇందుకోసం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. సోమవారం జూలపల్లి మండలం పెద్దాపూర్, తెలుకుంట గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్