పాలకుర్తి మండలం కుక్కలాగూడూర్ గ్రామంలో ముదిరాజ్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గమ్మ వేడుకలు బుధవారం మూడవ రోజు అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ, నైవేద్య సమర్పణ చేశారు. ఈ వేడుకల్లో స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.