దుర్గమాత ఉత్సవాలు ప్రారంభం: కుక్కలాగూడూర్ లో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమవారం దుర్గమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కుక్కలాగూడూర్ గ్రామంలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దుర్గామాతను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మండపంలో ప్రతిష్ఠించడానికి తీసుకువచ్చారు. మహిళలు ఒకే రంగు దుస్తులతో, కోలాటాలు, డీజే చప్పుళ్ల మధ్య మండపానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్