కాంగ్రెస్ పార్టీని గెలిపించండి: ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు కోరారు. బుధవారం సాయంత్రం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, 11న జరిగే ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు ఓటు వేయాలని స్థానికులను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలుపు నియోజకవర్గానికి మరింత మేలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్