మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం రాత్రి తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని కరీంనగర్‌కు వెళుతుండగా, పెద్దపల్లి శివారుల్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారుడిని గమనించి, అతనికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకుని ప్రాణాన్ని కాపాడారు. ఈ సంఘటన మంత్రి గొప్ప మానవత్వాన్ని చాటింది.