పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన కొమురయ్య మంగళవారం యాదాద్రి జిల్లాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొమురయ్య గత కొంతకాలంగా యాదాద్రిలో ఉంటూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తుండేవాడు. అయితే, కొమురయ్యది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.