గొర్రెల కాపరి కరెంట్ షాక్‌తో మృతి

పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులోని ఇటుక బట్టీ వద్ద శుక్రవారం కరెంట్ షాక్‌తో గొర్రెల కాపరి దాగేటి మల్లేష్ మృతి చెందాడు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న ఇటుక బట్టీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నేలపై ఉన్న కరెంట్ వైర్లను గమనించని మల్లేష్ ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బట్టీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్