పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో మల్లేశ్ (35) అనే గొర్రెల కాపరి విద్యుదాఘాతంతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లినప్పుడు, ఇటుక బట్టీల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వదిలేసిన విద్యుత్ తీగకు ఓ గొర్రె తాకింది. దాన్ని కాపాడే ప్రయత్నంలో మల్లేశ్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని గ్రామీణ ఎస్సై మల్లేశ్ తెలిపారు.